కరోనావేరియంట్ B.1.617 అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ రోజు వేలాది మందిని బలి తీసుకుంటోంది. అయితే దీనిని ‘ఇండియన్ వేరియంట్’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) పేర్కొన్నట్లు ఇటీవల కొన్ని మీడియా, సోషల్ మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టత ఇచ్చింది.
B.1.617 అనేది ‘ఇండియన్ వేరియంట్’ అనేందుకు ఆధారాలు లేవని, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తన నివేదికల్లో ‘ఇండియన్ వేరియంట్’ అనే పదం వాడలేదని తెలిపింది. ఈ కొత్త వేరియంట్ ఇండియాది అంటూ జరుగుతున్న ప్రచారం వల్ల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని తెలిపింది. ఈ అంశంపై విడుదల చేసిన నివేదికలో ‘ఇండియన్’ అనే పదాన్ని డబ్ల్యూహెచ్ఓ ఎక్కడా వాడలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
B.1.617 వేరియంట్‌ను డబుల్ మ్యూటెంట్‌గా కూడా పిలుస్తున్నట్లు, ఇది యాంటీబాడీస్‌ను తీవ్రంగా దెబ్బతీస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడానికి కూడా ఈ వేరియంటే కారణమని పేర్కొంది. కాగా, భారత్‌లోని సెకండ్ వేవ్‌కు కారణమైన ఈ వేరియంట్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.