కోవిడ్ నుండి కోలుకున్న వారి నుండి సమాచారం సేకరించి వారి అనుభవాలు ఇక్కడ వ్రాస్తున్నాను... మొదటగా కోవిడ్ అనగానే జ్వరం, జలుబు, ఒళ్ళునొప్పులు వీటితో పాటుగా రుచి, వాసనలు రావని చెబుతున్నారు డాక్టర్ లు. ఈ సందర్భంలో బాధితులు జ్వరానికి, జలుబుకి, ఒళ్ళునొప్పులకి మందులు ఉన్నాయి కాబట్టి వాడుతారు అలా ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. కానీ ఆహారం తినే విషయం లో రుచి వాసనను బట్టి తినే మనం ఎన్నో ఏళ్ళగా మన నాలుక కూడా వాటినే కోరుకుంటుంది కనుక రుచి, వాసన లేపోవడం వలన మనం సరిగా ఆహారం తీసుకోము దానివలన మనలో నీరసం వస్తుంది... ఇదే అదనుగా వైరస్ మనపై విజృంభణ చేస్తుంది.
ఇలా జరిగే సమయంలో నే మనం మన ఆహార నియామాన్ని మార్చుకోవాలి. ఎలా అంటే మనం ఎలాగైనా బ్రతికి తీరాలని నిర్ణయించుకుని ఆహారాన్ని బలవంతంగా తినడం ఎంతగా అంటే వీలైనంత ఎక్కువ ఆహారం అదీ తేలికగా అరిగే ఆహారం రుచీ పసీ లేనిదైనా తినాలి. అలాగే మనముందు ఇంతకంటే గొప్ప ఆహారం మనకు లభించదు అని తినాలి. మనం కేరళా వెళ్ళాము అక్కడ కొబ్బరి నూనేతో వండుతారు అది రుచి ఉండదు అయినప్పటికీ ఎలా తింటామో అలా తినాలి. అలాగే మనకు అన్నము కూర వండే వారికి వంటచేయడం రాదు అనే భావనతో తినాలి. ఇకపోతే కొత్తగా పెళ్ళయ్యింది ఆధునిక యువతి వంటరాదు అయినా భార్యమీద ప్రేమతో ఆహా ఓహో అంటూ పొగుడుతూ అన్నం తింటాము చూడండి అలా తినాలి. చివరిగా మనం అన్నం తినేముందు ఈ దేశం లో అన్నం లేక ఆకలితో ఇబ్బంది పడే కడు పేద ఎలా దొరికిన దాన్నే పరమాన్నంగా తింటాడో వారిని గుర్తు తెచ్చుకుని తినాలి.
ఇలా మనం కోవిడ్ బాధితులం అయ్యాము అని తెలిసిన రోజు నుండి వారం రోజులు ఓపికతో గనుక తింటే ఆ మందులు పనిచేసి ఈజీగా కోలుకునే అవకాశం ఉంది అని తెలిపారు. కాబట్టి మిత్రులారా కోవిడ్ వచ్చినప్పటికీ రాకముందు ఎలా అన్నం తిన్నామో అలా కాకుండా కాస్త సాత్విక ఆహారం కనుక వారం రోజులు తింటే చాలు ఈ కోవిడ్ నుండి బయటపడటం తేలిక... జై హింద్.