బ్రిటన్ పర్యటన రద్దు చేసుకున్న ప్రధాని నరేంద్రమోదీ. - Asthram News

ప్రధాని నరేంద్ర మోదీ  బ్రిటన్ పర్యటనను రద్దు సుకున్నారు. దేశంలో కరోనా సునామీలా విరుచుకుపడుతున్న ప్రస్తుత సంక్షోభ సమయంలో దేశంలోనే ఉండాలని ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. 

వచ్చే జూన్ లో బ్రిటన్ లోని కార్న్ వాల్ లో జరగనున్న జి-7 దేశాల శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోదీని  బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. వచ్చే జూన్ 11 నుంచి 13వ తేదీ వరకు  జరగనున్న జీ-7 దేశాల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాల అధినేతలు హాజరవుతున్నారు. 

ఈ సదస్సుకు భారత్ తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాధినేతలను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయితే దేశంలో కరోనా మహమ్మారి విరుచుపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశం విడిచి ఎక్కడకూ వెళ్లకూడదని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారని, దేశంలో కరోనా సంక్షోభ నివారణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
CLOSE ADS
CLOSE ADS