జూన్ రెండో వారం నుంచి తమ వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా రష్యాకు చెందిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను ప్రజలకు అందజేస్తామని అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రకటించింది. ఒక్కో డోసుకు రూ.1,195 వసూలు చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో రూ.995 వ్యాక్సిన్ ఖరీదు కాగా.. రూ.200 అడ్మినిస్ట్రేషన్ ఛార్జీల కింద తీసుకుంటామని తెలిపింది.
ఇప్పటి వరకు తమ సంస్థకు చెందిన టీకా కేంద్రాల ద్వారా పది లక్షల టీకా డోసులు పంపిణీ చేశామని అపోలో ఎగ్జిక్యూటివ్ వైస్-ఛైర్మన్ శోభనా కామినేని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఫ్రంట్‌లైన్ వర్కర్లు, కరోనా ముప్పు ఎక్కువగా ఉన్న జనాభా, కార్పొరేట్ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తూ వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తామని తెలిపారు. జూన్ నుంచి టీకా పంపిణీ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తామని ప్రకటించారు. వచ్చే నెల నుంచి ప్రతివారం పది లక్షల టీకాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. జులైలో దీన్ని రెండింతలు పెంచుతామని పేర్కొన్నారు. సెప్టెంబరు నాటికి రెండు కోట్ల డోసులు అందిస్తామని