మరోసారి గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయిల్. - Asthram News

గాజా సిటీ: ఇజ్రాయెల్‌, పాలస్తీనియన్ల ఘర్షణ పతాక స్థాయికి చేరుకుంటోంది. ఇప్పటివరకు హమాస్‌ ఉగ్రవాద స్థావరాలపైనే దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ శనివారం గాజా నగరంలో అసోసియేటెడ్‌ ప్రెస్‌(ఏపీ), అల్‌ జజీరా లాంటి ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థలు పనిచేస్తున్న 11 అంతస్తుల అల్‌-జలాల్‌ భవనాన్ని నేలమట్టం చేసింది. దాడి సమాచారాన్ని గంట ముందే భవన యజమానికి ఇజ్రాయెల్‌ అధికారులు అందించారు. ఆ తర్వాత క్షిపణులతో కూల్చివేసింది. అంతకుముందు ఇజ్రాయెల్‌ విమానాలు గాజా సిటీలోని ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న కాందిశీకుల శిబిరంపై బాంబుల వర్షం కురిపించాయి. దాడిలో 160 విమానాలు పాల్గొన్నాయి. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. సహాయక చర్యల్లో ఐదు నెలల చిన్నారిని శిధిలాల నుంచి సజీవంగా వెలికి తీశారు. ఇప్పటివరకు ఇజ్రాయెల్‌ దాడుల్లో 139 మంది మృతి చెందారు. హమాస్‌ దాడుల్లో 8 మంది చనిపోయారు. హమాస్‌ తాజా రాకెట్‌ దాడిలో టెల్‌ అవీవ్‌లో ఓ ఇజ్రాయెల్‌ పౌరుడు మృతి చెందాడు. హమాస్‌ ఉగ్రవాద సంస్థ నాయకుడు ఖలీల్‌ నివాసాన్ని బాంబులతో ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ పేర్కొంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
CLOSE ADS
CLOSE ADS